మన న్యూస్,తిరుపతి :
వెలగపూడి లోని సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ను బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య, క్రియేషన్ అగ్రి అండ్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి శాలువతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలను సింగంశెట్టి సుబ్బరామయ్య అందజేశారు. క్రియా జన్ అగ్రి అండ్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ సోమరాజు శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో బయో ఫెర్టిలైజర్స్ ను విక్రయించడానికి అవసరమైన లైసెన్సులను త్వరగా మంజూరు చేయాలని మంత్రిని కోరారు. అందుకు మంత్రి అచ్చం నాయుడు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.