మన న్యూస్: కరకగూడెం, వలస ఆదివాసులకు ఆధార్ స్వచ్ఛంద సంస్థ చేసే సేవలు మరువలేనిదని ఏడుల్ల బయ్యారం సిఐ వెంకటేశ్వర్లు కొనియాడారు. కరకగూడెం మండల పరిధిలోని వలస ఆదివాసి గ్రామమైన నీలాద్రి పేటలో ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు తోలెం రమేష్ ఆధ్వర్యంలో ఏడుల్ల బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై రాజేందర్ చేతుల మీదుగా చాపలు, డోర్ కర్టెన్స్, చెప్పులు, దుస్తులు, వాటర్ బాటిల్స్, సామాగ్రి పెట్టుకోవడానికి బ్యాగులు, బెడ్ సీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆధార్ సంస్థ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ మండలంలో ని వలస ఆదివాసి గ్రామాలలో ఆధార్ స్వచ్ఛంద సంస్థ అనేక అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. రానున్న రోజుల్లో వలసి ఆదివాసి గ్రామాలకు స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ, వినోద్, ఉమా మహేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.