చిత్తూరు,Mana News, జూలై 14: చిత్తూరు జిల్లా ఎస్.ఆర్.పురం మండలానికి చెందిన పైనేని మురళి సామాజిక సేవలో అద్భుతంగా రాణిస్తున్నారు .చిన్న వయసు లోనే ప్రజల కష్టాలను తనవిగా భావిస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తూ ,సమాజసేవా దృక్పదంతో ముందుకెళ్తున్నాడు పైనేని మురళి. తన పరిధిలోని ప్రతి గ్రామానికి వెళ్ళి , ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొంటూ… ఆ కష్టాలను తనవిగా.. మోస్తూ తగిన సాయం అందిస్తున్నారు. ప్రత్యేకించి తన నమ్మిన కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలబడే పైనేని మురళి , ఆపద కుటుంబాలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. చిరునవ్వుతో స్వీకరిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు.తను చదువుకున్న పాఠశాలలో… ప్రతి జ్ఞాపకం తనదేనంటూ, ప్రతి విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో కావాల్సిన సామాగ్రిని(పెన్నులు, పెన్సిల్స్ స్కేల్, ఏరేజరు,షాప్నరు,జామెంట్రీ బాక్స్) మొదలైనవి తన సొంత డబ్బుతో అందిస్తూ విద్యార్థులకు ఉత్సాహాన్నిస్తుంటారు. ఈ శౌర్యం విద్యాసంవత్సరం ప్రారంభంలో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది.ఇంతటి సేవా కారక్రమాల వెనక ఉన్న మానవతా దృక్పదం అందరికీ ఆదర్శంగా మారుతోంది. వృద్ధులకు అనాధలను మరియు అత్యవసర సమయంలో వైద్య ఖర్చులకి సహాయం చేయడం ద్వారా ఆయన సామాజిక బాధ్యతనం నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారు. సమజానికి మంచి చేయాలన్న సంతల్పంతో నడుస్తూ ఈ యువ నాయకుడిని ఆదర్శంగా తీసుకుని, మరెందరో యువత తమ గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపడతారనే నమ్మకంతో ప్రజలు ఆయనను అభినందిస్తున్నారు.