గొల్లప్రోలుజూలై15.మనం న్యూస్ :- గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పిఠాపురం సిఐ జి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం సాయంత్రం గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. గొల్లప్రోలు శివారులో గంజాయి రవాణా జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు 15 వ తేదీ మధ్యాహ్నం ఎస్ ఐ ఎన్ రామకృష్ణ తన సిబ్బందితో పట్టణ శివారులోని నల్లం వారి లేఅవుట్ వద్దకు వెళ్ళగా గంజాయిని సమానంగా పంచుకోవడానికి గమనించి కాకినాడ రేచర్ల పేట కు చెందిన కడియపు ప్రేమ్ కుమార్, నక్కపల్లి మండలం రాజంపేటకు చెందిన మడ్డు లోకేష్, పిఠాపురం మంగయ్ అమ్మ రావు పేటకు చెందిన ధనాల మనోహర్, యు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామానికి చెందిన రామిశెట్టి దుర్గాప్రసాద్, మరో మైనర్ బాలుడి ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుండి నాలుగు కిలోల గంజాయి, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పోలీస్ స్టేషన్ తరలించి విచారించగా కాకినాడ రేచర్ల పేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు నక్కపల్లిలో గంజాయి సరపరా చేసే వ్యక్తి వద్ద నుండి గంజాయి తీసుకొని గొల్లప్రోలు చేరుకోగా అప్పటికే సదరు గంజాయి కోసం నల్ల వారి లేఔట్ వద్ద వేచి ఉన్న పిఠాపురం, మూలపేట గ్రామానికి చెందిన ఇరువురు వ్యక్తులు సమానంగా పంచుకొని కొంత సరుకు సొంతంగా వాడుకొని, మిగిలిన సరుకును ఎక్కువ రేటుకు అమ్ముకొని డబ్బులు సంపాదించాలని నిందితులు తెలిపినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు వివరించారు.