మన న్యూస్, తిరుపతి:- గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ స్టేడియంలో ఈనెల 13 14 తేదీలలో జరిగిన రాష్ట్రస్థాయి మోడరన్ పెంటా తలాన్ ఛాంపియన్షిప్ పోటీలలో తిరుపతికి చెందిన క్రీడాకారుడు జి పవన్ కళ్యాణ్ అండర్ 19 విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. ఇతనితో పాటు రాష్ట్ర స్థాయి పోటీలలో అండర్ 19 మెన్స్ విభాగంలో పునీత్ కు బ్రాంజ్ మెడల్, అండర్ 15 విభాగంలో మోహిత్ కు సిల్వర్ మెడల్ సాధించినట్లు ఆ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మోనికా తెలిపారు. రాష్ట్రస్థాయిలో మెడల్స్ సాధించిన వీరంతా బీహార్లో వచ్చే నెలలో జరగబోయే జాతీయస్థాయి క్రీడా పోటీలలో పాల్గొనేందుకు అర్హత సాధించారు. ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ మోటివేటర్ కోటపాటి హరిబాబు పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.