గూడూరు, మన న్యూస్:- కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోతున్నా,మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతో రాష్ట్ర,జిల్లా కమిటీల ఇచ్చిన పిలుపు మేరకు, తిరుపతి జిల్లా గూడూరు ఏ.పీ.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో బుధవారం 16వ తేదీ నుండి సమ్మెలోనికి వెళ్లనున్నట్లు గూడూరు మున్సిపల్ కమిషనర్ ఎ.వెంకటేశ్వర్లు కు సమ్మె నోటీసు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం కార్యదర్శి ధారా. కోటేశ్వరరావు, గౌరవాధ్యక్షులు జోగి శివకుమార్, సి.ఐ.టి.యు గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి బి.వి.రమణయ్య,ఎం. సాయి.టి.రాఘవ,యన్.భాస్కర్ యు.కిషోర్, తదితరులు పాల్గొన్నారు.