ఎక్కడ క్వార్టర్ కొన్న మూతలు జరిపోతున్నాయి, మద్యం తగితేనే ప్రమాధమనుకుంటే, కల్తీ మద్యం తాగితే ఇంకెంత ప్రమాదమో.. -మద్యంలో కల్తీ జరగకుండా జర జాగ్రత్త తీసుకోండి అని వేడుకుంటున్న మద్యం ప్రియులు
గూడూరు, మన న్యూస్ :- మద్యం తాగడమే ప్రమాదం అనుకుంటే మధ్యలో కల్తీ జరిగితే మరి ఎలా? కొంతమంది మద్యం ప్రియులు వద్ద నుంచి సేకరించిన వివరాల మేరకు గూడూరులో ఎక్కడ మద్యం కొన్న ఎక్కువ భాగం మద్యం బాటిల్ల మూతలు జారిపోవడం జరుగుతుందని దీనికి కారణం కొంతమంది రింగ్ మాస్టర్ల ద్వారా బాటిల్ల మూతలు ఓపెన్ చేయకుండా మూతలను పైకి లాగే అందులోని నాణ్యమైన మద్యాన్ని సగభాగం తీసివేసి దానిలో చీప్ లిక్కర్ బెంగళూరు మద్యాన్ని నింపుతున్నారని, అంతేకాకుండా కొంతమంది మద్యం ప్రియులైతే మద్యాన్ని మానడం కష్టతరమయ్యే తీసుకునే మధ్యలో నాణ్యత తక్కువ ఆల్కహాల్ పర్సెంట్ ఉండే విధంగా ఎంతో విలువైన ఖరీదైన మధ్యాన్ని సేవిస్తున్నారు. అలాంటి ఖరీదైన మధ్యలో సైతం బాటిల్ల మూతలను పైకి లాగే నాణ్యతలేని మద్యాన్ని నింపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తంతు అంతా అధికారులు షాపు ఓనర్లు షాపులలో పనిచేసేవారు అందరికీ తెలిసే జరుగుతుందని మద్యం ప్రియుల ఆరోపణ. ఎప్పటికప్పుడు మద్యం నాణ్యత విషయంలో సంబంధిత అధికారులు పర్యవేక్షణ ఉండాలని వేడుకుంటున్నారు.