దిల్సుఖ్నగర్. మన న్యూస్ :- ఎల్ బి నగర్ నియోజకవర్గం లోని దిల్సుఖ్నగర్ లో గోవింద రావు నేతృత్వంలోని సీవీ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలిస్ ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిధిగా వీచ్చేసిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అండ్ టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా వారు యాజమాన్యం ను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీజీపీ ఎల్ బి నగర్ కోటేశ్వర రావు,రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి,మేనేజింగ్ డైరెక్టర్ గోవింద రావు,డైరెక్టర్లు వెంకట్ చోళ, మహేశ్వర్ రెడ్డి,సాయి రెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.