గూడూరు, మన న్యూస్ :- గూడూరు మండలం విటాత్మకూరు గ్రామానికి చెందిన ఎస్సీ ఎస్టీ 20 కుటుంబాలు వారు తిరుపతి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ & ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులైన యేసుపాకు పెంచలయ్య ద్వారా మండల తహసిల్దారు కి అర్జీ ఇవ్వడం జరిగింది. మిఠాత్మకూరు గ్రామంలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలు వారు అడవి పోరంబోకు భూములను గత 20 సంవత్సరముల నుండి సాగు చేసుకుంటూ ఉన్నారు. ఈ భూముల ద్వారా వారి యొక్క జీవనాధారం చేసుకుంటూ వర్షాధార పంటలు పండించుకుని జీవించేవారు సదరు భూములకు సంబంధించి 20 మంది ఎస్సీ కుటుంబాలకు కంప్యూటర్ అడంగల్ లో సాగు చేసుకున్నట్లుగా రికార్డులు కూడా ఉన్నాయి. మిగిలిన కుటుంబాలు వారు రెవెన్యూ అధికారులను ,ఆర్డిఓ గారిని పట్టాలు ఇవ్వమని గతంలో కోరి ఉన్నారు. ఈ సమస్యపై మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వర రాజు గారు విటాత్మకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు చిట్టేటి శ్రీహరి గారు, కృష్ణా రెడ్డి గారు తదితరులు హాజరైనారు.