స్థానికులలో దేశీవలి వరి రకాలపై పెరుగుతున్న ఆదరణ
మన న్యూస్,ఎస్ఆర్ పురం : - మండలంలో కొత్తపల్లి గ్రామపంచాయతీ 49 కొత్తపల్లి మిట్ట గోవిందరెడ్డి కాంప్లెక్స్ లో( పృద్వి మిత్ర రైతు ఉత్పత్తిదారుల సంస్థ) రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రాన్ని ఆదివారం తహసిల్దార్ లోకనాథ పిల్లై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే కాలంలో ప్రకృతి వ్యవసాయం పైనే ఎక్కువ ఆధార పడవలసి వస్తుంది. క్రిమిసంహారక మందులను రైతులు ఎక్కువ మోతాదులో పంటలపై పిచికారి చేయడంతో ఆరోగ్యం పైన చెడు ప్రభావం చూపిస్తుంది. దీంతో ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. అందుకనే ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం లో గో ఆధారిత పంటలనే తీసుకుంటే ఆరోగ్యం బాగా ఉంటుందని తెలియజేశారు. ఈ కేంద్రాన్ని చూస్తే పాత రోజులు గుర్తుకొస్తాయని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కేంద్రంలో నవారా రక్తసాలి పోక్కూర్ కళాకార్ పుంగార్ మాపళ్ళె సాంబ, కాలాబట్టి, బహు రూపీ కకోడీ , మైసూర్ మల్లిగా సిద్దసనాల రాజముడి చిట్టి ముత్యాలు ఇలా దేశీవలి వరి రకాల ధాన్యాలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు కూరగాయలు అందుబాటులో ఉన్నట్లు పృద్వి మిత్ర రైతు ఉత్పత్తిదారుల సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.