వెదురుకుప్పం, Mana News,:– జూలై 13, 2025 :- ఈ రోజు వెదురురుకుప్పం మండలంలో తిరుమల రాజుపురంలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైన చెంగారెడ్డి అభినందన సభ మండల అధ్యక్షుడు బి. అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు గారు మాట్లాడుతూ చెంగారెడ్డి పార్టీకి అహర్నిశలు చేసిన సేవలు గుర్తించిన జిల్లా పార్టీ ఈయనకు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా పదవి వచ్చిందని తెలియజేశారు. చెంగరెడ్డి మాట్లాడుతూ ఈ పదవి రావడానికి కృషిచేసిన జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు కి, శ్రీమతి పురంధేశ్వరి మేడమ్ కి,మాధవన్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం మండలం అధ్యక్షులు అశోక్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు మనివర్మ,జిల్లా కన్వీనర్ GK చౌదరి,GD నెల్లూరు ఇంచార్జి రాజేంద్రన్ , కోశాధికారి సవిరెడ్డి మురళి,ప్రధాన కార్యదర్శులు బాలాజీ మరియు గోపి, ఉపాధ్యక్షులు సోము రాజు,మోహన్ రెడ్డి, యువమోర్చ అధ్యక్షులు రామకృష్ణ రెడ్డి,మహిళ మోర్చా అధ్యక్షులు శ్రీమతి మల్లికా,BC మోర్చా మురళి, వివిధ మండలాల అధ్యక్షులు,టీడీపీ నాయకుడు గుణశేఖర్ రెడ్డి,జనసేన నాయకులు యతీశ్వర్ రెడ్డి,బీజేపీ సీనియర్ నాయకులు గోవింద రెడ్డి మరియు విజయ్ భాస్కర్ రెడ్డి,యువనాయకుడు దామోదర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసి దుశ్యాలువ తో సత్కరించారు.