మన న్యూస్ ,నెల్లూరు, జూలై 12: నెల్లూరు ఓవెల్ విద్యాసంస్థల విగ్నైట్ యాప్ ను శనివారం ఉదయం నెల్లూరు మాగుంట లేఔట్లో ఓవెల్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఆ సంస్థ చైర్మన్ వేణు మరియు విద్యా సంస్థల డైరెక్టర్స్ కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఓవెల్ విద్యాసంస్థల చైర్మన్ వేణు మాట్లాడుతూ ........ఈ యాప్ నర్సరీ నుండి 12th క్లాస్ వరకు కొత్త విద్యా విధానానికి అనుగుణంగా రూపొందించబడినది అని అన్నారు. విద్యార్థుల విభిన్న మేధస్సుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని అన్నారు.విద్యార్థి అభివృద్ధి చెందాల్సిన అంశాలపై కచ్చితత్వంతో పనిచేస్తుందని ,విద్యార్థి కార్యాచరణ విశ్లేషణ చేసి ప్రతిపక్ష పరీక్ష, క్విజ్, అసైన్మెంట్ ట్రాక్ చేయడం ద్వారా విద్యార్థుల పనితీరును పురోగతి విరవణాత్మకంగా అందిస్తుంది అని అన్నారు. ఉపాధ్యాయుడు మరియు విద్యార్థిలను ఒకే వేదికపై తీసుకువచ్చే సమగ్ర బోధన అభ్యాసన పర్యావరణ వ్యవస్థను రూపొందిస్తుందన్నారు. దీనితో పాటు సిలికాన్ లోరేట్ అను మరో యాప్ ను కూడా ప్రారంభించారు .ఈ యాప్ ఒకటో తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ ఆర్ ప్రమీల ,జిఎం మహదేవ్ , ఈడి బాలు, డీజీఎం సుధాకర్ శ్రీనివాస్, రఫీ ,మీనాక్షి ఎక్స్ట్రా మార్క్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ వి. వంశీ ,క్లస్టర్ ఐ టి డి జి సూర్య తేజ్ , ఏజీఎం గంగాధర్, కళాశాల ఇంచార్జ్ విద్య ,ఓవెల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ ఏజీఎం, లెక్చరర్స్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, వారి తల్లితండ్రులు పాల్గొని ఈ కార్యక్రమను విజయవంతం చేశారు.