
శంఖవరం /చెందుర్తి మనన్యూస్ ప్రతినిధి :-కంటి వైద్య శిబిరంలో ఉచితంగా అన్ని రకాల కంటి పరీక్షలు అనగా దగ్గర చూపు, దూరపు చూపు, తలనొప్పి, మెడనొప్పులు, మోతిబిందువు, మొదలగు అన్ని రకాల కంటి పరీక్షలు జరిపి అవసరం ఉన్నవారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తామని క్యాంపు నిర్వాహకులు డాక్టర్ కొంగు రమేష్ వెల్లడించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గం చెందుర్తి గ్రామంలో పరిసర ప్రాంత ప్రజలకు దైవ సేవకులు మంగం ప్రభుదాసు స్మరణతో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ పొస్టర్ మంగం జాన్ ప్రసాద్ మరియు పద్మావతి కంటి ఆసుపత్రి వైద్యులు కొంగు రమేష్ ఆధ్వర్యంలో ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ సంఘం యొక్క సహకారం తో జగ్గయ్య నుయ్యి దగ్గర, ప్రభుదాస్ మాస్టార్ కొత్త స్థలం నందు పద్మావతి కంటి ఆసుపత్రి ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కొంగు రమేష్ మాట్లాడుతూ, ఉదయం 10 గంటల నుండి సాయంత్యం 4 గంటలు వరకు జరిగిన కంటి శిబిరంలో సుమారుగా 100 మందికి పరీక్షలు చేయిగా 15 మందికి ఆపరేషన్ నిమిత్తము వాసన్ కంటి ఆసుపత్రికి తరలించడం జరిగిందని అన్నారు. ఈ వెద్య శిబిరం లో తలనొప్పి, చత్వారం, దృతైలోపం ఉన్న వారికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి తక్కువ ధరకే నాణ్యమైన కళ్ళజోడు ఇవ్వడం జరిగిందన్నారు. కంటి ఆపరేషన్లు ఆవసరమైన వాటికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా బిపి, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. ఈ అవకాశాన్ని ప్రజలు అందరు సద్వినియోగ పరుచుకొవాలని. ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో గునపర్తి సునీల్ కుమార్, ఎస్ రాజు, కె. నాగేంద్ర, బత్తిన తాతాజీ తదితరులు పాల్గొన్నారు.