శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన మోసాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని ఎన్నికల్లో ప్రజలకు అమలు కాని హామీలు బాండు రూపంలో ప్రజలకు హామీలు ఇచ్చి నేటికీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కిర్లంపూడి లో మాజీ మంత్రి పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం నివాసంలో నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ సమావేశంలో బొత్స సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతతో నియోజకవర్గంలో వైసిపి కార్యకర్తలు వేలాదిమంది కదం తొక్కి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదరణ కోల్పోలేదని నియోజకవర్గంలో గిరిబాబు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాన్ని బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా వైసీపీ కార్యకర్తలు తమ బలాన్ని చూపించారు. గిరిబాబు మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న అభిమానం మరవలేనిదని నా తండ్రి ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు నన్ను పెంచి పోషించారని నియోజకవర్గంలో నా తండ్రి చేసిన అభివృద్ధి నా తండ్రికి కూడా తెలియకుండా అభివృద్ధి వైపే అడుగులు వేసేరే తప్ప అవినీతి వైపు ఎప్పుడు కన్నెత్తి చూడలేదని నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమంలో చూపించిన అభిమానం చూస్తే మీరు మా కుటుంబం పట్ల చూపిస్తున్న అభిమానానికి మా కుటుంబం అంతా నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటుందన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి అమలు కాని హామీలు ఇచ్చి కక్షపూరితంగా నిబంధనల పేరుతో పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలను ప్రభుత్వ వైఫల్యాలను గ్రామాల్లో ప్రజలకు వివరించేలా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని చంద్రబాబు చేసిన మోసాన్ని వివరిద్దామన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ప్రజలపై ఆంక్షలు పెట్టి మోసం చేసిందన్నారు. టిడిపి మేనిఫెస్టో చూసి ప్రజలు మోసపోయారని అప్పట ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను అప్పటి మంత్రులు అధికారులు ఒక భగవద్గీత ఒక ఖురాన్ ఒక పవిత్ర గ్రంథంలా భావించి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. దాడిశెట్టి రాజా మాట్లాడుతూ మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం రాష్ట్రంలో ఒక బ్రాండ్ అని తన తనయుడు గిరిబాబు కూడా నియోజకవర్గంలో కష్టపడి పని చేస్తున్నాడని కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రతి గ్రామంలో ప్రజలకు వివరించేలా త్వరలో కార్యచరణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ హోం మంత్రి తానేటి వనిత, మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తోట నరసింహం, మాజీ ఎంపీ వంగా గీత, యువజన రాష్ట్ర విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ దవులూరి దొరబాబు, యనమల కృష్ణుడు,మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, తదితరులు పాల్గొన్నారు.