గుంతకల్లు (నామలసేటు కళ్యాణమండపం) మన న్యూస్: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతి శ్రీనివాస్ వర్మ నేటు గుంతకల్లు పట్టణంలో నిర్వహించబడుతున్న 'రోజ్గార్ జాబ్ మేళా' కార్యక్రమానికి ప్రధాన అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా, భారతీయ జనతా పార్టీ అనంతపురం జిల్లా మహిళా మోర్చా నాయకురాలు సౌభాగ్య శ్రీరామ్, బిజెపి సీనియర్ నాయకులు దగ్గుబాటి శ్రీరామ్ మంత్రి వర్యులను మర్యాదపూర్వకంగా కలిసి, పార్టీ తరఫున అభివాదాలు తెలిపారు. ఈ ఉద్యోగ మేళా ద్వారా స్థానిక యువతకు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రముఖంగా మాట్లాడుతూ, ప్రభుత్వం యువకుల ఉపాధి కోసం చేపట్టిన వివిధ పథకాలను వివరించారు.పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు మరియు స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.