ఉరవకొండ మన న్యూస్: వజ్రకరూరు మండలంలోని వెంకటాంపల్లి గ్రామంలో మాత శిశు సంరక్షణ కార్యక్రమాలు, మరియు గర్భవతులకు, బాలింతులకు, 5సంవత్సరాల పిల్లలకు వ్యాధి నోరోధక టీకాలు అందించడం లో మెరుగైన పాత్ర అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రసావాలు జరిగేటట్లు కృషి చేసినందుకు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందించినందుకు గాను ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా ఉత్తమ ఏ ఎన్ ఎం గా ఎంపిక చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని డి ఎం హెచ్ ఓ కార్యాలయంలో శనివారం ఉత్తమ అధికారులకు అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డి ఎం హెచ్ ఓ డాక్టర్ దేవి, స్టాటికల్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, డెమో అధికారులు త్యాగరాజు, గంగాధర్ హాజరై వారి చేతుల మీదుగా ప్రశంస పత్రం, నగదు అవార్డు ను అందజేసి సత్కరించారు. ఉత్తమ ఏఎన్ఎం వనజ్యోతి మాట్లాడుతూ…. వజ్రకరూరు మండల వైద్య అధికారులు డాక్టర్ తేజస్వి, డాక్టర్ సర్దార్ వలి, మరియు వైద్య సిబ్బంది ప్రోత్సాహంతోనే ఈ అవార్డు ను అందుకోవడం జరిగిందన్నారు. ఈ సత్కారాలు అవార్డులు మరింత బాధ్యతను పెంచుతున్నాయన్నారు. వైద్య అధికారులు డాక్టర్ తేజస్వి డాక్టర్ సర్దర్ వలి, సిహెచ్ఓ లక్ష్మీదేవి, ఎం పి హెచ్ ఈ ఓ గురు ప్రసాద్, సూపర్వైజర్ సుశీలమ్మ, నాగ శంకర్, పలువురు ఏఎన్ఎంలు అభినందించారు.