తుర్కయంజాల్. మన న్యూస్ :- కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం లో భాగంగా క్యాబినెట్ లో స్థానిక సంస్థల ఎన్నికలలో బిసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ తుర్కయంజాల్ కూడలిలో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పాలాభిషేకం చేసిన స్థానిక నాయకులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టిఫిసిసి కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ను కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి బీసీలందరు రుణపడి ఉంటారని గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో 27 శాతం ఉన్న రిజర్వేషన్ను కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టో లో పెట్టినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చినమాటకు కట్టుబడి సామాజిక న్యాయం కోసం కృషి చేసిన AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కి బిసీ రిజర్వేషన్లు అంశానికి ముందడుగువేసి అందరిని తట్టి లేపిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కి, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ కి, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి మంత్రి వర్గ బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ మాజీ జెడ్పిటిసి సభ్యులు బింగి దాస్ గౌడ్, గడ్డాన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ చారి, నాయకులు దాసరి సుధాకర్ రెడ్డి, కుంట గోపాల్ రెడ్డి, పూజారి శంకరయ్య గౌడ్, గుడ్ల అర్జున్, ఎల్మెటి వెంకట్ రెడ్డి, శ్యామల, ఎరుకలి రవి,శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు