కర్మన్ ఘాట్ . మన న్యూస్ :- ప్రసిద్ధి చెందిన శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానమునకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి సోదరుడు శ్రీ ఎనుముల కొండల్ రెడ్డి శ్రీ స్వామి వారి దర్శనార్థము విచ్చేయగా వారికి ఆలయ వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజల అనంతరము, ఆశీర్వచనం, శ్రీ స్వామి వారి ఫొటో, ప్రసాదము అందచేయడం జరిగినది.
ఈ కార్యక్రమములో ఆలయ కార్యనిర్వహణాధికారి యన్. లావణ్య, ఆలయ చైర్మన్ శ్రీ ఈదులకంటి సత్యనారాయణ రెడ్డి, ధర్మకర్తలు, దిండు ప్రవేణ్ గౌద్, తోకటి కిరణ్ కుమార్, జనుంపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, నారాయణ్ దుర్గా రెడ్డి, కుకునూరి గోపాల్ రెడ్డి, పూల నాగరాజు, కె. కవిత, కొండ్ర సంతోష్ కుమార్, గండిగారి శ్రీనివాస్ గౌడ్, ఎనుముల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు