నవంబరులో మూడు రోజులు జాతీయ స్థాయి సదస్సు, కంచి మఠం విద్యాపీఠం నిరంజన్ వర్మ గురూజీ వెల్లడి
మన న్యూస్,తిరుపతి, జూలై12: సమస్త మానవాళి మంచి ఆరోగ్యానికి గో ఆధారిత పంచగవ్య ఔషధాలే ప్రధానమని, ఇందుకు గోరక్షే శ్రీరామరక్ష అని కంచి మఠం విద్యాపీఠం పంచగవ్య ఆచార్యులు నిరంజన్ వర్మ గురూజీ పేర్కొన్నారు. శనివారం సాయం సంధ్య వేళ శ్రీవారి పాదాల చెంత నెలకొన్న అలిపిరి గోశాల వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గో పాదయాత్ర నిర్వహించిన బాలకృష్ణ గురు స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ నెల 14 నుంచి 16 వరకు మూడు రోజులపాటు జాతీయస్థాయిలో సదస్సు నిర్వహించి 2000 మంది పైగా దేశం నలుమూలల నుంచి హాజరయ్యే గో బంధువులకు పంచగవ్య ఔషధాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి నగరంలో నిర్వహించ తలచడం అభినందనీయమని అభయ హస్త గోవింద సేవా మండలి సభ్యులు చంద్రమౌళి, జగన్నాథం, రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్రాజు సుకుమార్ రాజు, ఆర్ఎస్ఎస్ పద్మనాభరెడ్డి, కనుమూరి గీతాంజలి, ఝాన్సీ లక్ష్మీబాయి, ప్రసన్న లక్ష్మి, శ్రీపతి తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి స్థానికులుగా తమ వంతు సహాయ సహకారాలు సంపూర్ణంగా అందిస్తామని వారు తెలిపారు. మానవ మనుగడకు పంచేంద్రియాలు ఎలా ఉపయోగపడతాయో గోవు నుంచి లభించే పంచగవ్యాలు మంచి ఆరోగ్యానికి ఉపయుక్తమవుతా యన్నారు. ఈ సమావేశంలో శ్రీ వినాయక సాగర్ వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబశివారెడ్డి ఉపాధ్యక్షులు సుకుమార్ సహాయ కార్యదర్శి సాయి కృష్ణంరాజు, శివ ప్రసాద్ రాజు, శ్రీపతి, కనుమూరి గీతాంజలి, ప్రసన్న, లక్ష్మి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.