కాణిపాకం నవంబర్ 27 మన న్యూస్
కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి పవిత్ర మాలలను *పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కి* కాణిపాకం ఆలయ అధికారులు బహుకరించారు. బుధవారం ఉదయం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని ఆయన నివాసంలో కాణిపాకం దేవస్ధానం ఆలయ వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ ఈవో గురుప్రసాద్ స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించారు. ఇటీవల్ల కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన పవిత్రోత్సవాల్లో స్వామి వారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన పవిత్ర మాలలను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ కి బహుకరించారు. తర్వాత స్వామి వారి చిత్ర పటాన్ని, తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారిపై తన భక్తిభావం వ్యక్తం చేస్తూ, ఈ దివ్య అవకాశం దక్కించినందుకు దేవస్థానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం దేవస్ధానం ఈవో గురుప్రసాద్, ఐరాల మండల అధ్యక్షులు గిరిధర్ బాబు, కాణిపాకం ఆలయ మాజీ ఛైర్మన్ మణినాయుడు, చిత్తూరు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు మరియు కాణిపాకం దేవస్ధానం వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గోన్నారు.