మన న్యూస్ సాలూరు జూలై 12:- పార్వతిపురం మన్యం జిల్లా , నెల్లిపర్తి కాలనీకి రోడ్లు మంచి నీటి సౌకర్యం ని కోరుతూ కాలనీవాసులు నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా కాలనీ మహిళలు ఎస్ పార్వతి ఆదిలక్ష్మి సిహెచ్ చిన్నారి నాయుడు జోగులమ్మ మాట్లాడుతూ కాలనీలో సుమారు 30 కుటుంబాలు నివాసం ఉంటున్నామని వర్షాలు పడడం వల్ల రహదారి మొత్తం బురదమయంగా మారిపోయి నడవడానికి వీలు లేకుండా పోయిందని రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు గతంలో కాలనీవాసులు ప్రభుత్వానికి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోగా ఈ కాలనీలో గ్రావిల్ రోడ్లు వేసేసామని వ్రాత పూర్వక సమాధానమిచ్చారని తెలిపారు మరి రోడ్లు వేస్తే ఎక్కడ వేశారో కనబడడం లేదని తెలిపారు రోడ్లు వేయకుండానే వేసినట్లు చెప్పడం సరికాదని తెలిపారు రోడ్లు వేయకుండా వచ్చిన నిధులు ఎక్కడికి పోయావని నిధులు దుర్వినియోగం చేసిన వారిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా రోడ్లు మంచినీళ్లు సదుపాయం కల్పించాలని కోరారు ఇంటి నిర్మాణాలు చేయడానికి సిమెంటు ఇసుక ఐరన్ వంటి సామగ్రిని తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని తెలిపారు మంచినీళ్లు లేకపోవడం వలన బోరు నీళ్లు తాగవలసి వస్తుందని దాని వలన జలుబు జ్వరాల బారిన పడుతున్నామని తెలిపా తెలిపారు చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్న పరిస్థితి ఉందని ఈ పరిస్థితి నుండి తప్పించి రోడ్లు మంజూరు చేసి నిర్మాణం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు పాల్గొని మద్దతు తెలిపారు కాలనీవాసులు సింహాచలం జ్ఞాన ప్రకాష్ ఆదినారాయణ పద్మ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.