గూడూరు, మన న్యూస్ :- రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సాధారణమని విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శ చేయాలి తప్ప దాడులు చేయడం అమానుషమని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగా మురళి వెల్లడించారు గూడూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ విలేకరుల సమావేశం నిర్వహించారు
గూడూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగా మురళి విలేకరుల సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే నల్లపురెడ్డి కుటుంబానికి ఎంతో గౌరవం ఉందని ఆ కుటుంబానికి చెందిన మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు నోటితో మాట్లాడిందానికి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాకు ఎంతో ప్రశాంతమైన జిల్లా అని పేరు ఉందని ఎప్పుడూ ఇటువంటి దాడులు జరగలేదని అన్నారు దాడి జరిగిన తర్వాత పోలీస్ వ్యవస్థ సక్రమంగా స్పందించలేదని దాడి పై న్యాయవ్యవస్థ ద్వారా పోరాటం చేస్తామని వెల్లడించారు ఈ సమావేశంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి ,సంపత్ కుమార్ రెడ్డి, రాధారెడ్డి ,పూర్ణ తదితరులు పాల్గొన్నారు .