గూడూరు, మన న్యూస్ :- గెలిచిన సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని అందుకే ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వచ్చి వాటిని వివరిస్తున్నారని గతంలో ఎవరు ఇటువంటి కార్యక్రమం చేపట్టలేదని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు మండలం తిప్పవరప్పాడు ,కందలి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాల్గొని ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు 10 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నాకు పెన్షన్లు ,అమ్మఒడి ,వచ్చాయని చెబుతుంటే ఎంతో ఆనందం కలిగిందని తెలిపారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని గతంలో ఎప్పుడూ లేనివిధంగా గెలిచిన సంవత్సర కాలంలోనే ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వచ్చి సంక్షేమ పథకాలను తెలియజేస్తున్నారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .
**