మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలకు వచ్చే స్థానిక ఎలక్షన్ లో 42 శాతం రిజర్వేషన్ కల్పించడంపై నిజాంసాగర్ మండల కాంగ్రెస్ బిసి నాయకులు శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్ లను పెండింగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బీసీలకు సమన్యాయం కల్పిస్తూ 42 శాతంరిజర్వేషన్ లను కల్పించిందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సామా జిక బీసీ వర్గాల అభి వృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు.ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు అనిస్,రాములు,కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.