ఎస్ఆర్ పురం,మన న్యూస్… పిల్లలను బంగారు భవిష్యత్తుగా తీర్చే బాధ్యత ఉపాధ్యాయులు తల్లిదండ్రులదే అని పాతపాలెం ఎంపీపీఎస్ మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు హిమాచలపతి అన్నారు గురువారం పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు హిమాచలపతి మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు పాఠశాల సహకారం అందించాలని కోరారు. ప్రతి విద్యార్థి ఇంటి వద్ద కొంతసేపు ఆడుకుని క్రమశిక్షణగా చదివించే బాధ్యత కూడా తల్లిదండ్రులు తీసుకోవాలని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు వివిధ ఆట పోటీలు నిర్వహించారు ఆట పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దీనాతి విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు