గూడూరు, మన న్యూస్ :- గూడూరు ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని జనాభా నాణ్యత ఆర్థిక అభివృద్ధి అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివ ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ జనాభా 8.2 బిలియన్ కు చేరుకుందని, ఇండియా జనాభా 146 కోట్లకి, ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్ల 34 లక్షల 48 వేలకు చేరుకుందని అయితే జనాభా పెరుగుదల అభివృద్ధికి పర్యావరణ సమతుల్యానికి అనుకూలంగా ఉంటే ప్రపంచ మానవాళికి ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి 2025 ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క ఇతివృత్తాన్ని న్యాయమైన , ఆశాజనకమైన ప్రపంచంలో వారు కోరుకునే కుటుంబాలను సృష్టించడానికి యువతను శక్తివంతం చేయడం అని ప్రకటించిందని తెలిపారు. అదేవిధంగా కార్యక్రమ నిర్వాహకుడైన అర్థశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ బి. పీర్ కుమార్, చరిత్ర అధ్యాపకులు డాక్టర్ గోవింద్ సురేంద్ర, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి. విజయ మహేష్ మాట్లాడుతూ జనాభా పెరుగుదల పైన కాకుండా జనాభా నాణ్యత పైన దృష్టి పెట్టాలని అనగా మంచి విద్య, ఆరోగ్యము, శ్రామిక నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే జనాభా శీఘ్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టరు వై. శ్రీనివాసులు, అధ్యాపకులు శ్రీధర్ శర్మ, కిరణ్మయి, డాక్టర్ శైలజ, డాక్టర్ ఝాన్సీ వాణి, కృపా కరుణ వాణి, భీమవరపు లక్ష్మి, రవి రాజు, హిమబిందు, గోపాల్, జనార్ధన్, శైలజ, శ్రీలత, ఉష, సుందరమ్మ తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.