మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పరిధిలోని మక్తల్ మండలం కర్ని గ్రామంలో గురు పౌర్ణమి వేడుకలను శ్రీ మారుతీ దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బ్రహ్మచారి అయినటువంటి గురువు స్వామివారిని శాలువా పూలమాలతో సత్కరించి అనంతరం పాద పుష్పార్చన చేసి గురు యొక్క ఉన్నత్వాన్ని కర్ని గ్రామ ప్రజలు గుర్తు చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, గురువు' ఈ ఒక్క పదం మానవాళి మనుగడకు మూలాధారం అని,అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి జ్ఞానమనే వెలుగు వైపుకి నడిపించేవాడే నిజమైన గురువు. పురాణాల నుంచి ప్రస్తుత కలం వరకు చుస్తే గురువు లేనిదే మనిషి జీవనం ఉండదు. అవతార పురుషులైనా రాముడు, కృష్ణుడు కూడా గురువు వద్ద విద్యను అభ్యసించినవారే. అందుకు గురువు స్థానం ఎప్పుడు గొప్పది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు,తదితరులు పాల్గొన్నారు,