శంఖవరం మన న్యూస్ ప్రతినిధి;-
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని మండల ప్రజా పరిషత్తు ప్రాధమిక పాఠశాలలు, మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ ప్రాధమిక పాఠశాలు, జిల్లా ప్రజా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ, ఎయిడెడ్ పాఠశాల, జూనియర్ కళాశాలలు… ఇలా మొత్తం 50 విద్యా సంస్థల్లో విద్యార్థులతో వారి తల్లి, దండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ (మెగా పేరెంట్స్ టీచర్స్) సమావేశాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగాయి. శంఖవరం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ ఆత్మీయ సమావేశానికి 243 మంది తల్లిదండ్రులు, శంఖవరం ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ ఆత్మీయ సమావేశానికి 315 మంది తల్లిదండ్రులు హాజరై విద్యార్థుల ప్రగతి గురించి చర్చించారు. విద్యార్థులు తమ తమ హోలిస్టిక్ కార్డులను వారి తల్లి తండ్రులకు అందజేశారు. విద్యార్థుల ప్రదర్శించిన కోలాటం, ఫొటో బూత్, అచీవ్ మెంట్ వాల్, తల్లికి వందనం నమూనా, తల్లిదండ్రులు పొడవు, బరువు, వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులైన తల్లిదండ్రులు అందరినీ ఆకట్టు కున్నాయి. ఈ ప్రదర్శనల్లో విద్యార్థులతో పాటుగా తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యమై ఉత్సాహంగా గడిపారు. అంతేకాకుండా ఒకేషనల్ బ్యూటీ కోర్సు నేర్చుకుంటున్న విద్యార్థులు వారి తల్లులకు గోరింటాకుతో వివిధ ఆకృతులను ముద్రించి మెప్పించారు. రంగోలి, టగ్ ఆఫ్ వార్ పోటీల్లో విద్యార్థుల తల్లి దండ్రులు ఉత్సాహంగా పాల్గొని బహుమతులను గెలుచు కున్నారు. అంతే కాకుండా విద్యార్థులకు నిర్వహించిన ఎలక్ట్యూష్, చిత్రకళా రచన పోటీల్లో విజేత విద్యార్థులకు బహుమతులను, విద్య అభ్యాసంలో ఘనమైన ప్రతిభకనపరచిన విద్యార్థులకు జ్ఞాపికలను బహూకరించారు. విద్యార్థులతో పాటుగా వారి తల్లిదండ్రులు కూడా మధ్యాహ్నం సహపంక్తి భోజనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఏపీ.మోడల్ స్కూల్స్ అకాడమిక్ మోనిటరింగ్ ఆఫీసర్ కే.కృష్ణవేణి, శంఖవరం మండల ఎంపీడిఓ ఏ.లక్ష్మీరెడ్డి, ఎంపీడీవో వై.నాగలక్ష్మి, ఎంఈఓ1. ఎస్.వి.రమణ, ఎంఈఓ 2. టి. గోవింద్, ఎస్ఎంసి. చైర్మన్ ఏ.అనూష, ఎస్ఎంసి చైర్మన్ జి.లక్ష్మీజ్యోతి, శంఖవరం ఐసిడిస్. సీడీపీవో. పి.వెంకటలక్ష్మి హాజరు అయ్యారు. ప్రతీ పాఠశాలలోనూ మండల వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా టెలికాం అడ్వైజరీ బోర్డు సభ్యుడు మేకల కృష్ణ, శంఖవరం ఉపసర్పంచ్ చింతంనీడి కుమార్, ఐసిడిఎస్ సూపర్ వైజర్ బి.వెంకట రజని, కె.జి.బి.వి. ప్రిన్సిపాల్ బి.బాలామణి కుమారి, ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఎ.వీర్రాజు, ఉపాధ్యాయేతర సిబ్బంది, ఏఎన్ంలు, ఎం.ఎల్.హెచ్.పీలు, ఆశ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.