శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి నియోజకవర్గంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయినాధుని ఆలయాలు భక్తులతో కిక్కిరి సాయి. సాయినాధుని పర్వదినం గురువారం కావడంతో భక్తులు ఉదయం నుండి ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలతో సాయినాధునికి పూజలు నిర్వహించారు. ప్రత్తిపాడు మండలం రౌతుపాలెం గ్రామంలో సాయినాధుని నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరిబాబు మాట్లాడుతూ సమాజంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఏడాది ఇటువంటి అన్నదాన కార్యక్రమాలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రామిశెట్టి నాని, జల్లిగంపల ప్రభాకర్, రామిశెట్టి వీర్రాజు, గొల్లపల్లి కాశీ విశ్వనాథ్, శిగిరెడ్డి శ్రీనివాస్, గుణ్ణం వెంకటరమణ , నేదుళ్ళ శ్రీనివాస్, లొండ బాబులు, దేవర రమేష్, తదితరులు పాల్గొన్నారు.