కలిగిరి, మన న్యూస్ : పిల్లల బంగారు భవిష్యత్తు కోసం. బడివైపు ఒక అడుగు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు పిలుపుమేరకు జరుగుతుందని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు.
అందులో భాగంగా గురువారం ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం లోని మోడల్ హైస్కూల్ మరియు వింజమూరులోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డు కాదు అని,ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు రావాలి.. వారి పిల్లల చదువు క్రమశిక్షణ గురించి తెలుసుకోవాలి. ఉపాధ్యాయులతో చర్చించాలి, ఉపాధ్యాయులు కూడా ఏ సబ్జెక్టులో పిల్లలు వెనుకబడి ఉన్నారో గుర్తించి, ఆ పిల్లల వివరాలను తల్లిదండ్రులకు తెలియజేయాలి. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలి,ఇదే మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 45094 పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. సుమారు రెండు కోట్ల మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి భాగస్వామ్యం అయ్యారన్నారు. విద్య శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు విద్యావ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుడుతూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం నిధులను జమ చేసిన ఘనత టిడిపి ప్రభుత్వానిది అని తెలిపారు. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని,ఇలాంటి సమావేశాల్లో తప్పకుండా పాల్గొని, వారి పిల్లల పురోగతిని తెలుసుకొని పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు. అంతకుముందు విద్యార్థుల తల్లిదండ్రులకు టగ్ ఆఫ్ వార్ మ్యూజికల్ చైర్స్ ఆటల పోటీలు ముగ్గుల పోటీలను ఉత్సాహంగా నిర్వహించారు. వింజమూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ తనిఖీ చేశారు. విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. ముందుగా సరస్వతి దేవి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులురెడ్డి, ఎంఈ ఓ మధుసూదన్ రెడ్డి,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిహెచ్ మాలకొండయ్య, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, మండల కన్వీనర్లు బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, గూడా నరసారెడ్డి, పూసల వెంగప నాయుడు, వింజమూరు సర్పంచ్ నల్లగొండ్ల సృజన జనసేన కోఆర్డినేటర్, కొట్టే వెంకటేశ్వర్లు, జనసేన వింజమూరు మండల కన్వీనర్ బండారు సత్యనారాయణ, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పులిచర్ల నారాయణరెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు డేగ మధు యాదవ్, వింజమూరు సీనియర్ నాయకులు, మంచాల శ్రీనివాసులు నాయుడు, వనిపెంట సుబ్బారెడ్డి, జూపల్లి రాజారావు, కోడూరు నాగిరెడ్డి, కొండపల్లి వెంకటేశ్వర్లు, ముంతా శ్రీనివాసులు యాదవ్, దాట్ల రమేష్ రెడ్డి, గంగ పట్ల హజరత్, లేట్ జయన్న, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.