గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరు మండలంలోని తమ్మినపట్న పంచాయతీ గుమ్మలదిబ్బ గ్రామంలోని జడ్.పీ.హెచ్.ఎస్ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మెగా పేరెంట్స్ - టీచర్స్ సమావేశం గురువారం ఘనంగా జరిగింది.ఈ సందర్బంగా గుమ్మలదిబ్బ పరిధిలోని పాఠశాలను జడ్పీ హైస్కూల్ గా తీసుకువచ్చిన గూడూరు నియోజకవర్గం శాసన సభ్యులు డా" పాశం సునీల్ కుమార్,మరియు పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ తనంకి నానాజీ,మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి కి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు,తల్లిదండ్రులు మరియు నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సతీష్ యాదవ్, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు రామయ్య ,వెంకయ్య,సుబ్రహ్మమణ్యం,రోశయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.