విద్య ద్వారానే విద్యార్థుల జీవితాలలో వెలుగులు…..ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక మాజీ కౌన్సిలర్ తాతపూడి ఇశ్రాయేల్ కుమార్
గూడూరు, మన న్యూస్ :- . . రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ డే సందర్భంగా గూడూరు రెండవ పట్టణం జి .ఎస్. ఆర్. మున్సిపల్ హై స్కూల్ నందు ప్రధాన ఉపాధ్యాయులు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు ఆట,పాటలతో డ్రామాలతో సందేశాత్మకంగా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చి ఉపాధ్యాయులను, అతిధులను తల్లిదండ్రులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ యెక్క ప్రతినిధిగా స్థానిక మాజీ కౌన్సిలర్ తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ నేను ఈ స్కూలు పూర్వ విద్యార్థినని, నేను చదివిన స్కూలులో నేనే ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడటం గర్వంగా ఉందని , ఈ స్కూల్ నాకు మంచి విద్యాబుద్ధులు నేర్పించిందని , విద్యార్ధులు విద్య ద్వారానే తమ జీవితాలలో వెలుగులు నిండుకుంటాయని, తమ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని తెలుసుకోవాలని, విద్యార్థులు తల్లి ,తండ్రి, గురువు, దైవాలకు తమ జీవితాల్లో ప్రాముఖ్యతనిచ్చి, చక్కగా చదువుకోవాలన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల బాధ్యతలు కేవలం ఉపాధ్యాయులకే వదిలేయకుండా తమ వంతు బాధ్యతగా పిల్లలు ఎలా చదువుతున్నారు , వారి నడవడిక ఎలా ఉంది ? స్కూలుకు వెళుతున్నారా? లేదా? అనేది జాగ్రత్తగా గమనించి ఉపాధ్యాయులకు సహకరించాలని, నేడు తెలుగుదేశం ప్రభుత్వం లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్యార్థినీ విద్యార్థుల చదువుల నిమిత్తం చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి 13000 తల్లికి వందనం కింద ఇస్తున్నారని అలాగే యూనిఫామ్స్ బుక్స్ షూస్ బెల్టు స్కూలు తెరచిన వారం లోపలే అందజేస్తున్నారని డొక్కా మాణిక్యమ్మ మధ్యాహ్నం భోజనం ప్రవేశపెట్టి నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారని, విద్యా శాఖలో అనేక మార్పులు తీసుకుని వచ్చి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం కాక తదనుగుణంగా అనేక కోర్సులు ప్రవేశపెట్టి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మార్గాలు సూచిస్తున్నారని, కావున విద్యార్థినీ విద్యార్థుల తల్లి దండ్రులు ఈ విషయాలన్నీ తెలుసుకొని పాఠశాలలోని ఉపాధ్యాయులకు సహకరించి మీ పిల్లలు చక్కగా చదువుకునేట్లు శ్రద్ద వహించి, వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని సూచించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ,ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు