మన న్యూస్ సింగరాయకొండ:-
గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కోసం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని సింగరాయకొండ ఆయుస్మాన్ హాస్పిటల్ వైద్యాధికారులు సూచించారు.
బుధవారం జరిగిన ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో డా. ధీరేంద్ర, డా. వంశీధర్, డా. ఆయేషా, డా. లేనా రఫెల్, డా. ఛాయాదేవి లు పాల్గొని గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య సూచనలు ఇచ్చారు.ప్రతి నెల 9వ తేదీన జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రతి గర్భిణీ స్త్రీ వినియోగించుకోవాలని వైద్యులు తెలిపారు. గర్భధారణ నుండీ ప్రసవం వరకు వైద్యుల సూచనలు పాటించటం వల్ల ఆరోగ్యకరమైన ప్రసవం సాధ్యమవుతుందని తెలిపారు. వైద్యుల సలహాలతో పాటు, ఆరోగ్య కార్యకర్తల సూచనల్ని కూడా అనుసరించాలని సూచించారు.