మన న్యూస్ సింగరాయకొండ:-
కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరాయకొండలో కార్మిక సంఘాల నేతృత్వంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.సి ఐ టి యు జిల్లా కార్యదర్శి గం టే శ్రీనివాసులు మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాలు కార్మికులపై తీవ్రమైన దాడి”గా అభివర్ణించారు. ఈ కోడ్స్ వల్ల శ్రమ చట్టాల రక్షణ బలహీనమవుతోందని, న్యాయమైన హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు.బుధవారం ఆర్ టి సి బస్టాండ్ నుండి కందుకూరు రోడ్డు కూడలివరకు కార్మికులు భారీగా పాల్గొని నినాదాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు, ఐ ఎఫ్ టి యు, ఐ ఎఫ్ టి యు న్యూ, ఎ ఐ టి యు సి కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ప్రధానంగా పాల్గొన్న నాయకులు:
సుల్తాన్ బాషా, టి. రామమూర్తి, నక్కా శ్రీనివాసులు, మున్వర్ బాషా, రమణారావు, శ్రీదేవి, ఇందిరా, నాంచార్లు, అంబటి కొండలరావు, వై. సుబ్బారావు తదితరులు.