మన న్యూస్: రాయదుర్గం నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11న (శుక్రవారం) మధ్యాహ్నం 2:00 గంటలకు ఉడేగోళం మద్దినేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సర్వసభ్య విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మెట్టు గోవింద రెడ్డి గారి నాయకత్వంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకుడు శ్రీ సతీష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీ వెంకటరామిరెడ్డి, సమన్వయకర్త శ్రీ గోవింద రెడ్డి మరియు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శ్రీ మెట్టు విశ్వనాథ్ రెడ్డి హాజరుకానున్నారు. పార్టీ కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ మెంబర్లు, ఐదు మండలాల కన్వీనర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు సహా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ఆర్ సీపీ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ సమావేశం ద్వారా పార్టీ బలోపేతంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరగనుంది.