మన న్యూస్, నారాయణ పేట జిల్లా : రేపటి గురుపూర్ణిమ సందర్భంగా శ్రీనివాస కాలనీ అమృత సాయి బాబా దేవాలయం లో ప్రత్యేక పూజల ఏర్పాటుకు చేసారు. మందిరం ను దీపాల కాంతులతో అలంకరించారు. రంగుల లైట్ లు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ప్రతి ఏడాది లాగే ఇప్పుడు కూడా అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించబోతున్నట్టు ఆలయ అర్చకులు రాజ్ కుమార్ తెలిపారు. గురుపూర్ణిమ కార్యక్రమాలు ఉదయం గణపతి పూజ, పంచామృతాభిషేకం, స్వామి వారికి లక్ష్మీ గణపతి జయాది హోమం మరియు సాయి నాథునికి అభిషేకం, ప్రత్యేక హారతి నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం సాయంత్ర హారతి పల్లకి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, ఇట్టి కార్యక్రమన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.