మన న్యూస్, నెల్లూరు, జూలై 8: నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో యువజన విభాగం ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని కేక్ కటింగ్, రక్తదాన శిబిరం కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన విభాగం నేతలు.. కార్యకర్తలతో కలిసి.. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.. యువజన విభాగం నేతలతో కలిసి కేక్ కట్ చేసి వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన యువతను చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు.ఈరోజు మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజానాయకుడు డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ని ఊటుకూరు నాగార్జున అన్నారు.ఆయన జీవితమే ఒక ఉద్యమం. ప్రజల కష్టాలను తెలుసుకొని సంక్షేమ పాలన అందించిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి.ఆరోగ్యశ్రీ, రైతు బీమా, విద్యార్థులకు విద్యా భద్రత – ఇవన్నీ ఆయనే అందించిన ప్రజాసేవ పథకాలు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ, ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ ఉన్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి . వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.