దివంగత సీయం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు
ఉరవకొండ, మన న్యూస్:దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతిను కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళిలోగల వైఎస్సార్ విగ్రహానికి పూలమాలతోపాటు పార్టీ కండువాకప్పి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ మనుషుల్లో మహణీయుడు వైఎస్సార్ అని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు ముందు తరాలకు స్పూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి సోనియా శీనా, ఉపాధ్యక్షులు బ్యాళ్ళ శివప్రసాద్, జిల్లా కేకేసీ ఛైర్మెన్ అబ్బాస్ రహిమాన్, పట్టణ అధ్యక్షులు టి.సుధాకర్, నాయకులు , చీకలగుర్కి చంద్ర, రేణుమాకుపల్లి రవి, మీనుగ ఓబులేసు, టైలర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.