ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || July 8, 2025, 9:24 pm
బిజెపి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

అనంతపురం మన న్యూస్: ఈనెల 10-7-2025 గురువారం గురు పూర్ణిమ సందర్భంగా ప్రతి మండలంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, ఆశ్రమ నిర్వాహకులు, మఠాధిపతులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, ఆధ్యాత్మిక గురువులు మరియు కళాకారులను సన్మానించాలని పార్టీ నిర్ణయించింది.
కార్యక్రమ వివరాలు:- సన్మానించిన వ్యక్తులతో ఫోటోలు తీసుకోవడం.
- ఫోటోలను ఫ్రేమ్ చేసి సంబంధిత ఆశ్రమాలు, మఠాలు లేదా గురువులకు అందజేయడం.
- సమాజ సేవ, ఆధ్యాత్మిక ప్రచారంలో గురువుల ప్రయత్నాలను గుర్తించడం.
ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు మరియు నియమించబడిన ఇన్చార్జీలు సమన్వయంతో నిర్వహించాలని అనంతపురం జిల్లా భారతీయ జనతా పార్టీ, పార్టీ, అధ్యక్షులు రాజేష్, కోరారు.
https://www.mananews.co.in