గూడూరు, మన న్యూస్ :- దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆ మహనీయుడి జయంతి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం బాధాకరమని వైసిపి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగ మురళి వెల్లడించారు వైయస్సార్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని సాధుపేట శాంతినగర్ వద్ద ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ మేరీగ మురళి మరియు నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు
గూడూరు పట్టణంలోని శాంతినగర్ వద్ద ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ మేరీగ మురళి మరియు నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి అందరికీ అందించారు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఎమ్మెల్సీ మురళి మాట్లాడుతూ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని అవి పేదలకు ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు ఆ మహనీయుడు మృతి చెందిన బాధలో అనేకమంది మృతి చెందారని గుర్తు చేశారు మహానేత వైయస్సార్ జయంతి వేడుకలకు పోలీసులు అనేక ఆంక్షలు విధించడం బాధాకరమని అన్నారు రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన నల్లప్పరెడ్డి కుటుంబం లోని ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం పై దాడి చేయడాని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు చేవూరు విజయ మోహన్ రెడ్డి బొమ్మిడి శ్రీనివాసులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి సుబ్బారావు వాయు గండ్ల నాగరాజు సుభాన్ తదితరులు పాల్గొన్నారు .