గూడూరు, మన న్యూస్ ;- గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రేణుక వైద్య ఖర్చులకోసం రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజనేని శ్రీనివాసులు నాయుడు దాతృత్వంతో 15.వేల రూపాయలను ట్రస్ట్ సభ్యులు ప్రజేంద్రరెడ్డి,భాస్కర్ ల ద్వారా మంగళవారం రేణుక తల్లి సుజాతకు అందజేశారు.చిల్లకూరు మండలం నెలబల్లి రెట్టపల్లి అరుంధతివాడకు చెందిన కురుగొండ రేణుక అనే 13.సంవత్సరాల బాలిక గత కొన్నేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది.కూలి పనులు చేసుకుని జీవనం సాగించే రేణుక తల్లిదండ్రులు పాపకు వైద్యం చేయించే స్తోమత లేక రాజనేని శ్రీనివాసులు నాయుడును ఆశ్రయించారు.ఎంతోమంది నిరుపేదలకు విద్యా,వైద్యం అందిస్తున్న ఆయన వెంటనే స్పందించి 15.వేల రూపాయలను అందించినట్లు ట్రస్ట్ సభ్యుడు ప్రజేంద్రరెడ్డి తెలియజేశారు.