మన న్యూస్ నాగోల్ 13 డబుల్స్ విభాగంలో నేషనల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన పొద్దుటూరి అన్య మరియు వైభవ్ రమ్య గారిని నాగోల్ లోని ఉప్పల నివాసం లో సన్మానించి ఇద్దరికీ తలో 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను అభినందించారు.జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన సమాజానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.క్రీడాకారులకు ఉప్పల ఫౌండేషన్ ద్వారా అనేక సేవా సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కోశాధికారి హర్ష , క్రీడాకారుల తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.