శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- "సుపరిపాలన - తొలిఅడుగు" పేరిట నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారాన్ని సోమవారం శంఖవరం మండలం, వజ్రకూటం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ మాజీ సర్పంచ్ కీర్తి వెంకట సుభాష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సత్య ప్రభ రాజా నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను పాంప్లేట్స్ పంచి ప్రజలకు వివరించారు. ఈ పథకాలన్నీ మాకు అందరికీ అందుతున్నాయని గ్రామస్తులంతా సంతోషం వ్యక్తంజేశారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడగగా మీరు మాకు అన్ని సమకూరుస్తుంటే మాకు ఏ సమస్యలుంటాయమ్మా అంటూ బదులిచ్చారు. ఈ సందర్భంగా ముందుగా గ్రామస్తులంతా ఎమ్మేల్యేకు ఎదురెళ్లి, హారతులిచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో నియోజవర్గ పరిశీలకులు మెట్ల రమణబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వత్సవాయి సూర్యనారాయణ రాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెంగలేశ్వరుడు (శివ), తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శంఖవరం మండల అధ్యక్షుడు బద్ది రామారావు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.