తిరుపతి, జూలై 8 : తిరుపతి నగరంలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిగా పేరుగాంచిన రుయా హాస్పిటల్ చిన్నపిల్లల వార్డులో వసతి సౌకర్యాల లేమి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీసే పరిస్థితిని ఏర్పరుస్తోంది.సమీప రోజులలో జరిగిన పరిశీలనలో, చికిత్స పొందుతున్న శిశువులను తల్లులు ఈ క్యూబ్ లీడర్ (Infant Warmer/Incubator) పైన ఉంచిన సందర్భంలో, ఒక్కో బెడ్‌పై ఇద్దరు పిల్లలతో పాటు తల్లులు కూడా ఉండే స్థితి వెల్లడైంది. ఈ నేపథ్యంలో నిపుణులు, వైద్య వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రాస్ ఇన్ఫెక్షన్ ప్రమాదం :- ఒకే బెడ్‌పై ఇద్దరు తల్లులు, వారి శిశువులతో ఉండడం వల్ల గాలిలో వ్యాపించే ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం అధికంగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల్లుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల, చిన్నపాటి వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని తెలిపారు. హైజీన్ లోపం, వైద్య నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తన :- స్థలాభావం కారణంగా శుభ్రత నిర్వహణ లోపించడంతో పాటు, శిశువుల తల్లులను వేరు ఉంచాల్సిన నిబంధనల్ని విస్మరించడం ఆందోళనకరం. ఇదంతా ఐసోలేషన్ ప్రమాణాలను ధ్వంసం చేస్తూ శిశువుల ఆరోగ్యాన్ని ముప్పుపెట్టే విధంగా మారింది. వెంటనే చర్యలు తీసుకోవాలి :- చిన్నారులతో పాటు తల్లుల ఆరోగ్యాన్ని కూడా చిన్నచూపు చూడకుండా, హాస్పిటల్ పాలకులు తక్షణమే స్పందించి చిన్నపిల్లల వార్డులో పడకల సంఖ్యను పెంచాలని, కనీస హైజీన్ ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని తల్లులు, రోగుల బంధువులు కోరుతున్నారు. కొన్ని చోట్ల ఫ్యాన్ కూడా లేని పరిస్థితి శోచనీయంగా ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి చిన్నారి ఆరోగ్యం ముఖ్యం అన్న తత్వాన్ని గౌరవిస్తూ, అధికార యంత్రాంగం తక్షణమే సమస్యపై దృష్టిసారించాలని సామాజిక కార్యకర్తలు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.