మన న్యూస్: పాచిపెంట, నవంబర్ 26 పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో వ్యవసాయ పొలం లో తగాదా జరగడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చావు బ్రతుకుల మధ్య విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాచిపెంట ఎస్సై వెంకట సురేష్ కథనం మేరకు మంగళవారం నాడు ఉదయం సుమారు 9:30 నుంచి 10:00 గంటల సమయంలో పాచిపెంట మండలం పాంచాలి గ్రామం కూనబంధవలస రెవెన్యూ పరిధిలో మళ్లీ కోటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కి వ్యవసాయ పొలం ఉన్నట్టు తెలిపారు.ఆ వ్యవసాయ భూమికి ఆనుకొని ఉన్న పాంచాలి గ్రామస్తులు సేనాపతి బంగారు రాజు అతడు కుటుంబ సభ్యులకు భూమికి సంబంధించి వారిద్దరి మధ్య సివిల్ తగాదాలు ఉన్నట్టు తెలిపారు.( మంగళవారం) ఉదయం నీటి పైపు విషయంలో సదరు కోటేశ్వర రెడ్డితో సేనాపతి బంగారు రాజు అతని కుటుంబ సభ్యులు గొడవకు దిగి కర్రలతో, రాళ్లతో దాడి చేసినట్లు చెప్పారు.ఆ దాడిలో కోటేశ్వర్ రెడ్డి గాయపడగ సాలురు ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. తలకి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం పంపించారు.ఈ దాడి విషయంలో గాయపడిన కోటేశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైనదని దర్యాప్తు చేస్తున్నామని ఆయన విలేకరులకు తెలిపారు.