మన న్యూస్,నిజాంసాగర్(జుక్కల్): అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు సోమవారం బిచ్కుందలో ఘనస్వాగతం పలికారు. మంత్రికి క్రేన్ ద్వారా గజమాల వేసి డీజే,బ్యాండ్ మేళాలతో నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు.అంబేడ్కర్ చౌరస్తా నుంచి సభ వేదిక వరకు మూడు కిలో మీటర్ల బైక్ ర్యాలీ నిర్వహించారు.మంత్రి, ఎంపీ,ఎమ్మెల్యేలను సన్మానించి పుష్పగుచ్ఛాలు అందించారు.