ఉరవకొండ, మన న్యూస్: మంత్రి పయ్యావుల కేశవ్ ఇచ్చిన హామీకి కార్యరూపం ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఉరవకొండలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన ఆయన, ఏడాదిలోనే తన మాట నిలబెట్టుకున్నారు. సోమవారం పీఏబీఆర్ డ్యాం వద్ద మోటార్లను ఆన్ చేసి తాగునీటి సరఫరా ప్రారంభించారు. దీంతో ఉరవకొండలో నీటి సమస్య తీరనుంది. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.