ఉరవకొండ మన న్యూస్ జులై 6: దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, సౌబ్రాతత్వం, పాలనా దక్షత కలిగిన నరేంద్ర మోడీ మళ్లీ మళ్లీ ప్రధానమంత్రిగా కొనసాగాలంటూ విజయవాడ కనకదుర్గాదేవి దేవస్థానంలో అమ్మవారికి బిజెపి నేతలు ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు చేశారు. పూజలు అనంతరం , రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు, కేశవ నాయక్, మాట్లాడుతూ పరిపాలన దక్షత కలిగిన సమర్థుడైన ప్రధాన మంత్ర ని ఆయన అభివర్ణించారు. దేశ ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. సిద్ధాంతాలు ఆచరించటంలో, దేశ ప్రజల కు సంక్షేమ పథకాలు అందించటంలో నరేంద్రుడు మొట్టమొదటి వాడన్నారు. శాశ్వత దేశ ప్రధానిగా కొనసాగే హక్కు నరేంద్రుడికి చెందుతుందన్నారు. ప్రధాని పేరిట ప్రత్యేక కుంకుమార్చన విశేష పూజలు జరిపించారు. అమ్మ కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలోశివాజీ నాయక్ , నాయడు నాయక్, బిజెపి కార్యకర్తలు మరియు బిజెపి నాయకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు