మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) భారత రాజ్యాంగం గురించి ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్అ న్నారు.నిజాంసాగర్ మండలంలోని నవోదయ విద్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 26న మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ కమిటీలో ఉండి రచించారని అన్నారు.విద్యార్థి దశ నుండే రాజ్యాంగం గురించిన అవగాహన కలిగి ఉండాలని అన్నారు.అంతకు ముందు విద్యార్థులతో ప్రిన్సిపాల్ సత్యవతి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జవహర్ నవోదయ విద్యాలయం సమగ్ర సర్వే డేటా ఎంట్రీని కలెక్టర్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.డేటా ఎంట్రీ త్వరగా తప్పులు లేకుండా నిర్వహించాలని, అదనంగా లాగిన్స్ తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యాలయంలోని గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా మత్స్య శాఖాధికారి శ్రీపతి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, నవోదయ ప్రిన్సిపల్ సత్యవతి,తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీఓ గంగాధర్,ఎంపివో అనిత, విద్యాలయం విద్యార్థులు, ఉపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.