గూడూరు, మన న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య గూడూరు శాఖ
వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆదివారం జూలై 6వ తేదీన ఉదయం 10 గంటలకు గూడూరు రెండో పట్టణ పరిధిలోని శ్రీ ముంగమూరు సీతమ్మ గారి బ్రాహ్మణ భవనంలో అధ్యక్షులు అనిమెళ్ళ శివకుమార్ గారి దంపతులు మరియు నెల్లూరు వాస్తవ్యులు పండితొ పన్యాసికులు విశ్రాంత తెలుగు పండితులు బ్రహ్మశ్రీ ఆలూరు శిరోమణి శర్మగారు దంపతుల ఆధ్వర్యంలో సామూహిక శ్రీసత్యనారాయణ స్వామి వ్రతములు నిర్వహించడంజరిగినది, గూడూరు పట్టణ బ్రాహ్మణ బంధువులు 50 మంది దంపతులు పాల్గొని వ్రత కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలొ పట్టణంలోని ప్రముఖ డాక్టర్ c, జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి దంపతులు పాల్గొన్నారు, మరియు పట్టణంలోని బ్రాహ్మణ బంధువులందరూ పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి జయప్రదం చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో డాక్టర్ సి జనార్దన్ రెడ్డి గారు C రోహిణి ని ఘనంగా సన్మానించారు, అదేవిధంగా నెల్లూరు వాస్తు శ్రీ ఆలూరు శిరోమణి శర్మగారిదంపతులను కూడా సన్మానించడం జరిగినది, ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు అనిమెళ్ల శివ కుమార్ గారు, ఉపాధ్యక్షులు కడివేటి రామ్మూర్తి రు, సెక్రెటరీ చిట్టమూరుశ్రీనివాసరావు, ట్రెజరర్ విద్యా లలిత మరియు కమిటీ సభ్యులు డిబి శ్రీనివాస్ వేప కొమ్మ నరసింహారావు గారు పి పురుషోత్తం రావు , మరియు నెల్లూరు వాస్తవ్యులు విశ్వనాథ రవికుమార్ విశాఖపట్నం (జీఎస్టీ ఇన్స్పెక్టర్ k,భవ్య) మరియు వాలంటీర్లుగా మల్లికార్జున రావు శ్రీకాంత్ కార్తీక్ మరియు మహిళ సభ్యులు కొంతమంది వాలంటీర్లుగా పాల్గొనడం జరిగినది, బ్రాహ్మణ బంధువులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగినది.